కోరిక తీర్చలేదని వివాహితకు నిప్పు.. | Married Woman Molested In Tamil Nadu | Sakshi
Sakshi News home page

కోరిక తీర్చలేదని వివాహితకు నిప్పు.. మంటలతోనే

Mar 7 2020 7:50 AM | Updated on Mar 7 2020 7:52 AM

Married Woman Molested In Tamil Nadu  - Sakshi

సాక్షి, తిరువొత్తియూరు: కోరిక తీర్చలేదని వివాహితకు నిప్పుపెట్టిన ఘటన ధర్మపురి జిల్లాలో జరిగింది. వివరాలు.. ఆదియమ్మన్‌పేట మాదేమంగళం ప్రాంతానికి చెందిన పళణి బెంగళూరులో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఇతనికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య నీల, రెండో భార్య రత్నం, మూడో భార్య సౌమ్య. వీరిలో రత్నంను పళణి తనతోపాటు బెంగళూరుకు తీసుకెళ్లాడు. నీల, సౌమ్య మాదేమంగళంలో ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన యువకుడు వేలుస్వామి (27) అతని భార్య వనిత. ఈ క్రమంలో వేలుస్వామికి సౌమ్యతో పరిచయం ఏర్పడింది. గురువారం సాయంత్రం సౌమ్య ఇంటికి వెళ్లిన వేలుస్వామి ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. చదవండి: అమ్మాయిలపై వల : నకిలీ విజయ్‌ దేవరకొండ అరెస్ట్‌

దీంతో సౌమ్య అతన్ని బయటకు వెళ్లమని హెచ్చరించింది. అతను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా లైంగిక వేధింపులు చేస్తుండడంతో సౌమ్య విరక్తి చెంది కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో ఆగ్రహానికి గురైన వేలుస్వామి అగ్గిపుల్ల గీసి వేశాడు. దీంతో మంటలు అంటుకుంది. అతను అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో సౌమ్య మంటలతోనే అతన్ని పట్టుకుంది. దీంతో అతనికి కూడా మంటలు అంటుకున్నాయి. కేకలు విన్న స్థానికులు తీవ్ర గాయాలతో ఉన్న ఇద్దరిని ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

చదవండి: రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement