హనీ ట్రాప్ బారిన ప్రముఖులు? బయటకు రాని భారీ స్కాం! | khammam kalluru cyber crime honey trap scam crores | Sakshi
Sakshi News home page

హనీ ట్రాప్ బారిన ప్రముఖులు? బయటకు రాని భారీ స్కాం!

Mar 31 2026 11:41 AM | Updated on Mar 31 2026 1:07 PM

khammam kalluru cyber crime honey trap scam crores

ఖమ్మం జిల్లా: రాష్ట్రంలో ఎక్కడ సైబర్‌ క్రైం జరిగినా అందరి చూపు కల్లూరు డివిజన్‌పైనే పడుతోంది. కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్‌ ముఠా అయ్యప్ప సొసైటీ పేరుతో కాల్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి రూ.90 కోట్ల మేర కొల్లగొట్టారంటూ గత ఏడాది నవంబర్‌ 29న హైదరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేయడంతో ఈ ప్రాంతవాసులు ఉలికిపడ్డారు. అలాగే, డిసెంబర్‌ 24న రూ.547 కోట్ల మేర సైబర్‌నేరం వెలుగు చూడగా, ఇందులోనూ పోట్రు ప్రవీణ్‌తో పాటు మరికొందరే కాక మూల్‌ అకౌంట్లు ఇచ్చిన 45 మందిని అరెస్ట్‌ చేశారు. 

ఫిర్యాదుకు వెనుకంజ
కల్లూరు మండల కేంద్రంగా హనీ ట్రాప్‌తో సైబర్‌ నేరగాళ్లు రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు కొల్లగొట్టారనే ప్రచారం చర్చనీయాంశంగా మారింది. సుమారు ఆరు నెలల క్రితం హానీ ట్రాప్‌ జరగగా, పలువురు ప్రముఖులు బాధితుల్లో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడడం... కల్లూరు ప్రాంతవాసులు పలు సైబర్‌ నేరాల్లో నిందితులు కావడంతో పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. అయితే, హనీ ట్రాప్‌తో నష్టపోయినట్లు చెబితే వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఎవరూ ఫిర్యాదు చేయలేదని సమాచారం. కానీ రూ.కోట్లల్లో మోసం కావడంతో పోలీసులు విచారణ చేడుతూనే హైదరాబాద్‌ సైబర్‌ క్రైం విభాగం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇదేసమయాన గతంలో వెలుగు చూసిన సైబర్‌ నేరాల్లో ప్రధాన నిందితులు, వారి సన్నిహితుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాల కోసం రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు లేఖలు పంపించినట్లు సమాచారం. అంతేకాక నిందితుల్లో కొందరి బ్యాంక్‌ అకౌంట్లను సీజ్‌ చేసినట్లు తెలిసింది.

ఖమ్మం హనీ ట్రాప్ కలకలం బాధితుల్లో ప్రముఖులు

ధైర్యంగా ఫిర్యాదు చేయండి
సైబర్‌ నేరాల్లో డబ్బు కోల్పోయిన బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. బాధితుల గోప్యతకు భంగం ఏర్పడకుండా విచారణ చేపడుతాం. గతంలో నమోదైన సైబర్‌ కేసులు విచారణ దశలో ఉన్నాయి. హనీట్రాప్‌పై మాత్రం ఎలాంటి సమాచారం లేదు.
– వసుంధర యాదవ్, కల్లూరు ఏసీపీ  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement