తాగిన మైకంలో కత్తి పట్టుకుని భార్యాపిల్లలపై.. | Family Tragedy in Ranga Reddy District | Sakshi
Sakshi News home page

తాగిన మైకంలో కత్తి పట్టుకుని భార్యాపిల్లలపై..

Mar 31 2026 9:47 AM | Updated on Mar 31 2026 10:17 AM

Family Tragedy in Ranga Reddy District

రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాగిన మైకంలో భార్యాపిల్లలపై కత్తితో దాడి చేశాడు ఓ కసాయి. ఆమనగల్ మండలం పులిగోని పల్లి తండాలో ఈ దారుణం జరిగింది. తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు ఆ వ్యక్తి.

బాణావత్ రాందాస్ నాయక్ తన భార్య, కుమారుడు, కూతుర్ని కత్తితో పొడిచాడు. దీంతో అతడి భార్య, కుమారుడు మృతి చెందగా, కూతురికి తీవ్రగాయాలయ్యాయి. ఆ బాలికకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

కాగా, ఈ బాణావత్‌ పాల్పడ్డ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. బాణావత్ రాందాస్ నాయక్ తన భార్య పేరు కవిత, కుమారుడి పేరు హర్ష, కూతురి పేరు ప్రణితగా గుర్తించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement