ప్రియురాలిపై తుపాకీతో కాల్పులు.. | Man Shoots Girl Friend With Gun In karnataka | Sakshi
Sakshi News home page

ప్రియురాలిపై తుపాకీతో కాల్పులు..

Feb 27 2020 8:30 AM | Updated on Feb 27 2020 8:34 AM

Man Shoots Girl Friend With Gun In karnataka - Sakshi

అమరేంద్ర పట్నాయక్‌, ప్రియదర్శిణి (ఫైల్‌)

సాక్షి,కృష్ణరాజపురం(కర్ణాటక) : ప్రేమించిన యువతిపై నాటు పిస్టల్‌తో కాల్పులు జరిపి, తరువాత తాను తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. ఇద్దరూ ఒడిశాకు చెందినవారు కాగా బెంగళూరులో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి మారతహళ్ళి వంతెనవద్ద చోటు చేçసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఒడిశాకు చెందిన అమరేంద్ర పటా్నయక్‌ (33), మంగళవారం రాత్రి వైట్‌ఫీల్డ్‌ సమీపంలోని మున్నెకొల్లాల వద్ద ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న యువతి ప్రియదర్శిని పైన నాటు పిస్టల్‌తో కాల్పులు జరిపి పారిపోయాడు. గాయపడిన యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి చికిత్స పొందుతోంది. వీరిద్దరూ ప్రేమికులని సమాచారం.  

దుండగుని పరిస్థితి విషమం   
బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అమరేంద్ర పట్నాయక్‌ సైతం మారతహళ్ళి వంతెన వద్ద తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. పోలీసులు వచ్చి అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతనికి గొంతు భాగంలో, కడుపులో తీవ్ర గాయాలై ఉన్నాయి, పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెళిపారు. ఇది ఆత్మహత్య యత్నమా లేక ఎవరైనా దాడి చేశారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమరేంద్ర పటా్నయక్‌ వద్ద సుమారు 17 పేజీలతో కూడి ఆత్మహత్య లేఖ లభించించినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారమే గొడవకు కారణమని భావిస్తున్నారు. ఇద్దరూ కోలుకుంటే పూర్తి సమాచారం తెలుస్తుందని పోలీసులు చెప్పారు. వైట్‌ఫీల్డ్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు..నిందితుడి అరెస్ట్‌
తుమకూరు: ధార్మిక సంఘాలపై ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన  మధుగిరి తాలుకాలోని హోన్నాపుర గ్రామానికి చెందిన అతుల్‌కుమార్‌ సబర్‌వాల్‌ అనే నిందితుడిని  తుమకూరు జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు ఈనెల 10న ఓ ధార్మిక సంస్థకు చెందిన గురువుపై తన ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన సందేశంతో కూడిన వీడియో పోస్టు చేశాడు. దానిపై ధార్మిక సంస్థ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి అతుల్‌కుమార్‌ కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కేంద్రంలోని అజాద్‌ నగర్‌లో తలదాచుకొని ఉండగా తుమకూరు పోలీసులు వెళ్లి అరెస్ట్‌ చేసి  బుధవారం పట్టణానికి తీసుకొచ్చారు. నిందితుడిపై తుమకూరు, మధుగిరి, జయనగర,  గంగావతి గ్రామీణ,  శివమొగ్గ జిల్లా పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement