ఎనిమిదేళ్ల దళిత బాలికపై అత్యాచారం! | Man Molested Minor Girl in Visakhapatnam | Sakshi
Sakshi News home page

Jun 10 2018 4:38 PM | Updated on Jul 23 2018 8:51 PM

Man Molested Minor Girl in Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని పద్మనాభ మండలం రెడ్డిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల దళిత బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం జరిపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దళిత బాలికకు కళ్లబొల్లి మాటలు చెప్పి.. స్థానిక యువకుడు లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. గొర్రెల కాపరి అయిన నిందితుడు ఈశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విశాఖపట్నంలోని కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే, అత్యాచార ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. వారు వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తుండటం స్థానికంగా కలకలం రేపుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement