రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు | Man Injured In Accident | Sakshi
Sakshi News home page

ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు

Jun 13 2018 11:52 AM | Updated on Aug 30 2018 4:17 PM

Man Injured In Accident - Sakshi

రోడ్డు ప్రమాదానికి కారణమైన గుంత 

మంచిర్యాలటౌన్‌ : మంచిర్యాల పట్టణంలోని ఓవర్‌బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలో పడి సోమవారం రాత్రి బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులు గాయపడ్డారు. మంచిర్యాలకు చెందిన ఎండీ అఫ్సర్, యాసీన్‌ నస్పూరుకు వెళ్లి సాయంత్రం తిరిగి మంచిర్యాలకు వస్తుండగా ఒక్కసారిగా సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఇద్దరూ గుంతలో పడ్డారు.

దీంతో అప్సర్‌కు కుడికాలు కింది భాగంలో నరం తెగిపోయింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లిన వారిద్దరూ ఆర్‌అండ్‌బీ వారి నిర్లక్ష్యంతోనే రోడ్లపై గుంతలు ఏర్పడి పలువురు ప్రమాదాలకు కారణమవుతున్నారని, తమకు జరిగిన ప్రమాదానికి ఆర్‌అండ్‌బీ వారిపై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల పోలీసులకు బాధితులు మంగళవారం ఫిర్యాదు చేశారు.

అప్సర్‌ క్రీడాకారుడు కావడంతో, తనకు కాలి నరం తెగిపోవడం వల్ల తాను జిల్లా, రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు ఇబ్బందులు ఉంటాయని, తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మంగళవారం ట్రాఫిక్‌ ఏఎస్సై భవానీ మట్టితో గుంతను పూడ్చివేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement