ఒడిశాలో పాత్రికేయుడి దుర్మరణం

Man Died in Car Accident Odisha - Sakshi

సీతంపేట సమావేశానికి వెళ్లి వస్తూ పర్లాకిమిడి వద్ద మృతి

శ్రీకాకుళం, కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ జంట పట్టణంలో 25 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో స్థిరపడిన దుంపల ధర్మారావు(52) ఆదివారం మృతిచెం దారు. మెళియాపుట్టి మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో అవుట్‌ సోర్సింగ్‌ అధ్యాపకుడిగా కూడా పనిచేస్తున్న ఆయన... సీతంపేట ఐటీడీఏలో జరిగిన సమావేశానికి హాజరై, తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఒడిశాలోని పర్లాకిమిడి సమీపంలోని రాణిపేట వచ్చేసరికి ఆటోపై కారు దూసుకు రావడంతో అక్కడిక్కడే మృతిచెందారు.

ఆటోలో ఉన్న మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ధర్మారావు పలాసలో నివాసం ఉన్నప్పటికీ స్వగ్రామం పలాస మండలం లక్ష్మీపురం. ఆయన భార్య గీతావాణి మెళియాపుట్టి కేజీబీవీలో అవుట్‌ సోర్సింగ్‌ వర్కర్‌గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పలాస–కాశీబుగ్గ ప్రెస్‌క్లబ్‌ ప్రతినిధులు దుంపల మృతిపట్ల సంతాపం తెలియజేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top