నీల్వాయి వాగులో రైతు గల్లంతు | Man Died In A Canal In Mancherial | Sakshi
Sakshi News home page

నీల్వాయి వాగులో రైతు గల్లంతు

Jul 10 2018 1:41 PM | Updated on Aug 17 2018 2:56 PM

Man Died In A Canal In Mancherial - Sakshi

రోదిస్తున్న కుటుంబసభ్యులు

వేమనపల్లి(బెల్లంపల్లి) : నీల్వాయి వాగు దాటుతూ ప్రాజెక్ట్‌ పునరావాస కాలనీ గెర్రెగూడెంకు చెందిన మోర్ల సోమయ్య(60) సోమవారం సాయంత్రం గల్లంతయ్యాడు. ఉదయం నీల్వాయిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కు రుణం కోసం వెళ్లాడు. అప్పుడు వాగులో వరద ప్రవాహం లేదు. తిరుగు ప్రయాణంలో వాగు వద్దకు రాగానే మత్తడి నుంచి వాగులోకి వరద రావడం మొదలైంది.

సోమయ్య గ్రామానికి చెందిన టాకిరె సుధాకర్‌తో కలిసి వాగు దాటుతున్నాడు. అంతలోనే వరద ఉధృతి పెరిగింది. ఇరువైపులా జనం చూస్తుండగానే సోమయ్య వాగులో గల్లంతయ్యాడు. సుధాకర్‌ అతి కష్టంమ్మీద సురక్షితంగా ఒడ్డుకు చేరాడు.

విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు వాగు వద్దకు వెళ్లి గాలించారు. చీకటి పడడం, వాగులో ప్రవాహం పెరగడంతో ఆచూకీ లభ్యం కాలేదు. సోమయ్యకు భార్య లచ్చక్క, కుమారుడు సదాశివ్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కూతుళ్లకు వివాహమైంది.

Advertisement
 
Advertisement
Advertisement