మద్యం మత్తులో దొరికిపోయి.. హల్‌చల్‌! | Man Caught Drunk And Drive, Creates Ruckus | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో దొరికిపోయి.. హల్‌చల్‌!

Dec 15 2019 8:47 AM | Updated on Dec 15 2019 3:10 PM

Man Caught Drunk And Drive, Creates Ruckus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మద్యం మత్తులో వాహనం నడుపుతూ దొరికిపోయిన ఓ వ్యక్తి నగరంలో హల్‌చల్‌ చేశాడు. ఆసిఫ్‌నగర్-గుడి మల్కాపూర్ పోలీసు స్టేషన్‌ పరిధిలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకన్ అండ్‌ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మహ్మద్ షఫీ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ దొరికిపోయాడు. తనను పట్టుకోవడంతో అతను పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. కాసేపు మద్యం మత్తులో హల్‌చల్‌ చేశాడు. చివరికి పోలీసులు అతని వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి.. షఫీని పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement