
ప్రేమజంట
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ప్రేమ జంట వీడియో
కర్ణాటక, కృష్ణరాజపురం : తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమజంట తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సోషల్ మీడియాలో లైవ్ వీడియో ఇప్పుడు వైరల్ మారింది. వివరాలు...బెంగళూరు నగరంలోని గోరిపాళ్యకు చెందిన రక్షిత,శే షాద్రిలు గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో యువతి తండ్రి గంగాధర్ ఇరువురి వివాహానికి నిరాకరించాడు. ఈ క్రమంలో గత ఏడా ది మార్చి నెలలో రహస్యంగా వివాహం చేసుకున్న రక్షిత,శే షాద్రి రక్షణ కోరుతూ జేజే నగర్ పోలీసుస్టేషన్‌కు వచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న రక్షిత తండ్రి గంగాధర్ పోలీసుల ఎదుటే నెలరోజుల్లో ఇద్దరిని చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో రక్షిత, శేషాద్రిలు గత ఏడాది మార్చి నెలలోనే మూడిగెరెకు పారిపోయారు. తమ కుమార్తెను తమ కు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడనే కోపంతో యువతి తండ్రి గంగాధర్ శేషాద్రి తండ్రిని పదేపదే పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వేధించసాగాడు. ఈ పరిణామాలతో మనస్థాపం చెందిన రక్షిత, శేషాద్రిలు సోమవారం ఫేస్‌బుక్ లైవ్‌లో రక్షిత తండ్రి గంగాధర్ వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నామంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న మూడిగెరె పోలీసులు ఈ ప్రేమికుల కోసం గాలిస్తున్నారు.