పారాణి ఆరకముందే.. పట్టాలపై శవమైన జంట | Love Couple Commits Suicide on Train Track Karnataka | Sakshi
Sakshi News home page

పారాణి ఆరకముందే..

May 7 2019 7:56 AM | Updated on May 7 2019 7:56 AM

Love Couple Commits Suicide on Train Track Karnataka - Sakshi

విజయ్,లీలా పెళ్లి ఫోటో (ఫైల్‌)

పరిచయం ప్రేమగా మారింది, మధురానుభూతులు పంచుకున్నారు. పెద్దలు కాదన్నా పెళ్లి చేసుకున్నారు. కానీ ఏం జరిగిందో కానీ రైలు పట్టాలపై విగతజీవులుగా తేలారు. ఇది హత్యా, ఆత్మహత్యా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. వధువురాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ పట్టాల వద్ద దొరికింది.  

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: పారిపోయి వివాహం చేసుకున్న ప్రేమికులు రైలు పట్టాలపై మృతదేహాలైన సంఘటన దొడ్డబళ్లాపురం రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని కచేరిపాళ్యకు చెందిన వెంకటరాజు కుమారుడు లక్ష్మిపతి అలియాస్‌ విజయ్‌(20), శాంతినగర్‌ 7వ క్రాస్‌ నివాసి లక్ష్మినారాయణ, మంజుల దంపతుల కుమార్తె లీలా (18) నవదంపతులు. సోమవారం ఉదయం ఇద్దరి మృతదేహాలు పట్టణ శివారులోని వీరాపుర రైల్వే గేట్‌ వద్ద పట్టాలపై ఛిద్రమై కనిపించాయి. పట్టాల పక్కనే కొత్తగా కొనుగోలు చేసిన ఇంకా రిజిస్ట్రేషన్‌ నంబర్‌ కూడా లేని పల్సర్‌ బైక్‌ కూడా నిలిపి ఉంది. ఇద్దరూ బైక్‌పై వచ్చి ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. 

రైలు పట్టాల వద్ద నవదంపతుల మృతదేహాలు 
డెత్‌నోట్‌లో ఏముంది?  
ఘటనా స్థలంలో లీలా వ్రాసిన డెత్‌ నోట్‌ లభించింది. అందులో తాము ప్రేమించుకున్నామని, పెద్దలు ఒప్పుకోకపోయి నా, నెల క్రితం వివాహం చేసుకున్నామ ని అందులో ఉంది. అయితే కుటుంబ స భ్యుల వేధింపులు ఎక్కువవడంతో ఆత్మ హత్య చేసుకుంటున్నామని పేర్కొన్నా రు. విజయ్‌ కార్పెంటర్‌ పనిచేస్తుండగా, లీలా బెంగళూరు కాలేజీలో డిప్లోమా చదువుతోంది. వారం క్రితం లీలా తల్లితండ్రులు గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో లీలా కనబడడం లేదని ఫిర్యాదు చేశారు. దొడ్డ రైల్వే పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఇది హత్య కూడా కావచ్చని పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

రైలు పట్టాల వద్ద నిలిపిన బైక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement