వీళ్లు మనుషులు కాదు రాక్షసులు | Khammam Men Eliminates Monkeys In Vemsoor | Sakshi
Sakshi News home page

వీళ్లు మనుషులు కాదు రాక్షసులు

Jun 29 2020 9:43 AM | Updated on Jun 29 2020 9:43 AM

Khammam Men Eliminates Monkeys In Vemsoor - Sakshi

వీడియో దృశ్యాలు

 సాక్షి, ఖమ్మం : మూగ జీవాల పట్ల ప్రేమగా వ్యవహరించాల్సింది పోయి దాహార్తిని తీర్చుకునేందుకు వచ్చిన కోతిని చంపిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.. మండల పరిధిలోని అమ్మపాలెం గ్రామంలో సాదు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంటి ముందు ఉన్న తొట్టిలో నీటిని తాగేందుకు వచ్చిన కోతి ప్రమాదవశాత్తు అందులో పడిపోగా దానిని రక్షించాల్సింది పోయి రాళ్లతో, కర్రలతో కొట్టి చంపి బయట పడేశారు. సమీపంలోనే ఉన్న కోతుల గుంపు అక్కడకు రాగా వాటిని పారదోలేందుకు మరో కోతిని పట్టుకొని చెట్టుకు ఉరివేసి, కుక్కలను వదిలి దారుణంగా హింసించి చంపారు. ( సింహం ఘటనపై దేశాధ్యక్షుడి ఆగ్రహం! )

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాల్లో వైరల్‌గా మారింది. దీంతో జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫారెస్ట్‌ అధికారులు గ్రామంలో విచారణ నిర్వహించి సాదు వెంకటేశ్వరరావు, జోసెఫ్‌రాజా, జి.గణపతి అనే ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు మండల అటవీశాఖ సెక్షన్‌ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ( కొండెంగ‌కు గోరుముద్ద‌లు తినిపించిన మ‌హిళ‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement