జేసీ వర్గీయుల రౌడీయిజం

JC Prabhakar reddy Followers try to kill Ycp Leader - Sakshi

వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీ నేతపై హత్యాయత్నం

ఇళ్లు, ఫ్యాక్టరీలపై రాళ్ల దాడి

పట్టించుకోని పోలీసులు

సాక్షి, అనంతపురం : జిల్లాలోని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి వర్గీయలు బీభత్సం సృష్టించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వీధి రౌడిల్లా రెచ్చిపోయారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు గయాజ్‌ బాషా అలియాస్‌ మున్నాపై హత్యయత్నానికి పాల్పడ్డారు. దీంతో తాడిపత్రిలో తీవ్ర కలకలం రేగింది.

ఇటీవల టీడీపీ కార్యకర్తల చేతిలో గాయపడ్డ తన అనుచరున్ని ఆసుపత్రిలో పరామర్శించి  ఇంటికి వెళ్తున్న మున్నాపై కాపుకాసి దాడి చేశారు. ఆయన ప్రాణాలతో తప్పించుకోవటంతో రెచ్చిపోయిన జేసీ వర్గీయులు తన ఇళ్లు, ఫ్యాక్టరీపై రాళ్లతో దాడి చేశారు. వీటికి సంబంధించిన సీసీకెమెరా దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇంత జరిగినా పోలీసులు స్పందించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top