కవర్లో చిన్నారి మృతదేహం.. | Infant Dead Body In Polythene Cover In Balasore District | Sakshi
Sakshi News home page

కవర్లో చిన్నారి మృతదేహం..

Jun 7 2019 12:58 PM | Updated on Jun 7 2019 12:58 PM

Infant Dead Body In Polythene Cover In Balasore District - Sakshi

భువనేశ్వర్‌ : బాలాసోర్‌ జిల్లాలో గురువారం రాత్రి హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. పాలిథీన్‌ కవర్లో ఓ శిశువు మృతదేహం దర్శనమిచ్చింది. పట్టణంలోని కమ్యునిటీ హెల్త్‌ సెంటర్‌ పరిసర ప్రాంతాల్లో ఓ శునకం చిన్నారి మృతదేహం పీక్కుతింటుండగా.. కొందరు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement