భారత సంతతి విద్యార్థి కాల్చివేత

Indian student shot dead by armed robbers in Chicago - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో మరో భారత సంతతి విద్యార్థిని దోపిడీ దొంగలు కాల్చిచంపారు. షికాగోలోని డాల్టన్‌లో క్లార్క్‌ స్టోర్, గ్యాస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న అర్షద్‌ వోహ్రా(19)ను అక్కడ దొంగతనానికి వచ్చిన సాయుధులు గురువారం కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో వోహ్రాకు పరిచయమున్న బకర్‌ సయీద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. తన తండ్రికి బదులుగా వోహ్ర గ్యాస్‌ స్టేషన్‌లో ఆరోజు పనిచేస్తున్నాడని, నిందితుల ఆచూకీ తెలిపిన వారికి 12వేల డాలర్ల రివార్డును అందజేస్తామని పోలీసులు తెలిపారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top