వివాహేతర సంబంధం బయటపడిందని.. | Husband Suicide In Medchal | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం బయటపడిందని..

Mar 24 2018 8:03 AM | Updated on Mar 24 2018 8:03 AM

Husband Suicide In Medchal - Sakshi

మేడ్చల్‌:  పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ వ్యక్తి భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో అవమానం భరించలేక  ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అక్బార్జాపే ట్‌ గ్రామానికి చెందిన పద్మారావు ఆదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబం ధం కొనసాగిస్తున్నాడు. ఈనెల 20న అతను సదరు మహిళతో కలిసి  తుర్కపల్లి బస్‌స్టాండ్‌లో నిలిచి ఉండగా అదే సమయంలో అక్కడికి వచ్చిన పద్మారావు భార్య శిరీష వారిని నిలదీసింది. అనంతరం పద్మారావు భార్య, ఆ మె స్నేహితురాలిని కారులో ఘనాపూర్‌ క్షేత్రగి రి వెంకటేశ్వర గుడి వద్ద దించి ఇంటికి వచ్చా డు. శుక్రవారం గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.మేడ్చల్‌ పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement