భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న భర్త

Husband Murdered His Wife And Committed Suicide In Bengaluru - Sakshi

సాక్షి, బొమ్మనహళ్లి : వివాహేతర సంబంధం పచ్చని సంపారంలో చిచ్చురేపింది. అనైతిక సంబంధంపై ప్రశ్నించిన భార్యను హత్య చేసిన భర్త అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన  నగరంలోని పరప్పన అగ్రహార పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోఉన్న కూడ్లు సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... ఏఎఫ్‌సీఎల్‌ లేఔట్‌లో బీహార్‌కు చెందిన మనీష్‌ కుమార్‌(38), సంధ్యా(33) దంపతులు రెండు సంవత్సరాల క్రితం బెంగళూరు వచ్చి ఎఫ్‌సీఎల్‌ లేఔట్‌లో నివాసం ఉంటున్నారు.  మనీష్‌కుమార్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. (దూరమవుతామనే భయంతో..  ఆత్మహత్య)

ఈ విషయం భార్యకు తెలియడంతో దంపతులు నిత్యం గొడవపడేవారు.  తన భర్త వ్యవహారాన్ని సంధ్య తన తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో కోపోద్రిక్తుడైన  మనీష్‌ కుమార్‌ శుక్రవారం రాత్రికి భార్యను గొంతు పిసికి హత్య చేశాడు.  విషయం బయటకి  పొక్కకుండా జాగ్ర త్త పడ్డాడు. రెండు రోజులుగా కుమార్తె నుంచి ఫోన్‌ రాకపోవడంతో సంధ్య తల్లిదండ్రులు  ఆదివారం నగరానికి వచ్చారు. వారు ఇంటికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న మనీష్‌ కుమార్‌ మూడు అంతస్తుల భవనంపై నుంచి దూకి  ఆత్మహత్య చేసుకున్నాడు. సంధ్య తల్లిదండ్రులు వచ్చి చూడగా ఇంట్లో సంధ్య మృతదేహం, బయట మనీష్‌కుమార్‌ మృతదేహం కనిపిం  చాయి.  పరప్పన అగ్రహార పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. (నాడు మోసం.. నేడు మౌనం! )

(బస్సులు నడుపుదామా? వద్దా? )

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top