భార్యలపై కత్తితో దాడి చేసిన భర్త | Husband Knife Attack on his Two Wifes in Tamil Nadu | Sakshi
Sakshi News home page

భార్యలపై కత్తితో దాడి చేసిన భర్త

Aug 29 2019 9:31 AM | Updated on Aug 29 2019 9:31 AM

Husband Knife Attack on his Two Wifes in Tamil Nadu - Sakshi

తన ఇద్దరు భార్యలపై భర్త కత్తితో దాడి చేయడంతో మొదటి భార్య మృతి చెందగా రెండవ భార్య పరిస్థితి విషమంగా ఉంది.

చెన్నై ,తిరువొత్తియూరు: తన ఇద్దరు భార్యలపై భర్త కత్తితో దాడి చేయడంతో మొదటి భార్య మృతి చెందగా రెండవ భార్య పరిస్థితి విషమంగా ఉంది. తిరుపూర్‌ కరువాంపాళయం ఏపీడీ రోడ్డు ప్రాంతానికి చెందిన రమేష్‌ (40)కు శాంతి (33), తిలకవతి (30) అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. రమేష్‌కు మద్యం తాగుడు అలవాటు ఉంది. రోజూ మద్యం తాగి వచ్చి ఇంటిలో గొడవ చేసేవాడని తెలుస్తుంది. మంగళవారం రాత్రి భోజనానికి వచ్చిన సమయంలో భార్యలతో గొడవ పడ్డాడు. దీంతో ఆగ్రహం చెందిన రమేష్‌ ఇంట్లో ఉన్న కత్తితో ఇద్దరు భార్యలపై దాడి చేశాడు. ఈ ఘటనలో మొదటి భార్య శాంతి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది.  రెండవ భార్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. రమేష్‌ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement