
అంజలి భర్త రమేశ్ , ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంజలి
ఆడపిల్లలు పుట్టారని భర్త, అత్తమామల వేధింపులు
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని, కొడుకు పుట్టలేదని కాబట్టి, అదనంగా కట్నం తేవాలని మహిళను భర్త, కుటుంబ సభ్యులు మానసికంగా, శారీరకంగా వేధించిన సంఘట న నెలమంగల పట్టణ పరిధిలోని గణేశగుడి వీ ధిలో జరిగింది. రమేశ్ అనే ప్రబుద్ధుడు మాన వత్వం లేకుండా భార్య అంజలి(28)ని కట్నం కోసం తీవ్రంగా హింసించాడు. దీనికి అత్త మంజుళ, మామ చిక్కరంగయ్య, మరదలు తేజస్విని, మరిది హేమంత్‌లు వంతపాడేవారు.
అందరూ కలిసి ఒంటిపై వాతలు పె ట్టి నరకం చూపిస్తున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదేళ్ల సంసారంలో ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో అధికవరకట్నం తీసుకురావాల ని తనను నిత్యం వేధిస్తున్నారని పేర్కొంది. ఒంటినిండా వాతలతో అంజలి ప్రస్తుతం నెలమంగల ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందుతోంది. బాధితురాలి ఫిర్యాదుమేరకు పట్టణ పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.