రూ.50 ఇవ్వలేదని అంతమొందించారు | Friends Killed For 50rs in Karnataka | Sakshi
Sakshi News home page

రూ.50 ఇవ్వలేదని అంతమొందించారు

Nov 7 2019 8:15 AM | Updated on Nov 7 2019 8:15 AM

Friends Killed For 50rs in Karnataka - Sakshi

హతుడు మహమ్మద్‌ వాసీం(ఫైల్‌)

కర్ణాటక ,యశవంతపుర : గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు రూ.50 కోసం స్నేహితుడినే అంతమొందించారు.  ఈ ఘటన డీజేహళ్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. హతుడిని  మహమ్మద్‌ వాసీం(16)గా గుర్తించారు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో నిందితులు వాసీం వద్దకు బైక్‌పై వచ్చారు. రూ.50 ఇవ్వాలని అడిగారు. తన వద్ద డబ్బు లేదని పేర్కొనడంతో  గంజాయి మత్తులో ఉన్న నిందితులు వాగ్వాదానికి దిగి  కత్తులతో పొడిచి ఉడాయించారు. తీవ్రంగా గాయపడిన వాసీం అక్కడికక్కడే మృతి చెందాడు. బెంగళూరు తూర్ప విభాగం డీసీపీ డాక్టర్‌ శరణప్ప ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హంతకుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు విలేకరులకు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement