పశ్చిమగోదావరిలో విదేశీయుడి అరెస్ట్‌ 

Foreigner Arrested In Devulapalli Village West Godavari - Sakshi

సాక్షి, జంగారెడ్డిగూడెం: పాస్‌పోర్టు లేకుండా అనుమానాస్పదంగా సంచరిస్తున్న విదేశీయుడిని సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో మయన్మార్‌ దేశానికి చెందిన మహ్మద్‌ ఇస్లాం అనుమానాస్పదంగా సంచరించడంతో లక్కవరం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతని వద్ద పాస్‌పార్టు కూడా లేకపోవడంతో కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్‌కు ముందు హాజరు పరిచారు. అనంతరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. మహ్మద్‌ ఇస్లాం ఎందుకు వచ్చాడనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top