ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

చెన్నై: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాసు (ఐఐటీ– ఎం)లో ఫైనలియర్ విద్యార్థి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేరళలోని మళప్పురానికి చెందిన షాహుల్ కోర్నాథ్ (23) ఐఐటీ–ఎంలో నేవల్ ఆర్కిటెక్చర్ విభాగంలో బీటెక్– ఎంటెక్ (డ్యూయల్ డిగ్రీ) చదువుతున్నాడు. షాహుల్ శనివారం తన గదిలో సీలింగ్‌కు ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని వెల్లడించారు. హాజరు తక్కువగా ఉండటంతో షాహుల్ కొంత ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోందన్నారు. షాహుల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, ఘటనపై దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
మరిన్ని వార్తలు