30 మంది మావోయిస్టులు.. ఏవోబీలో ఎన్‌కౌంటర్‌..! | Encounter In AOB Between Police And Maoists | Sakshi
Sakshi News home page

Sep 27 2018 7:09 PM | Updated on Mar 28 2019 5:07 PM

Encounter In AOB Between Police And Maoists - Sakshi

పాతచిత్రం

ఒడిషా : ఆంధ్ర-ఒడిషా సరిహద్దులోని (ఏవోబీ) కోరాపుట్‌ జిల్లా కుడుబు వద్ద పోలీసులు, మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఎన్‌కౌంటర్లో సుమారు 30 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియల్సి ఉంది. కాగా, గత ఆదివారం ఉదయం ఏవోబీలోని అరకులోయలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను మావోయిస్టులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. (చదవండి : ఎమ్మెల్యే హత్య ఇదే తొలిసారి)

Advertisement
 
Advertisement
Advertisement