బెంగాల్‌లో నోడల్‌ అధికారి అదృశ్యం

EC nodal officer goes missing in West Bengal - Sakshi

కృష్ణానగర్‌ (పశ్చిమబెంగాల్‌): సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో ఈవీఎంలు, వీవీప్యాట్లను పర్యవేక్షించే నోడల్‌ అధికారి అదృశ్యమయ్యారు. దీంతో జిల్లా యంత్రాంగంతో పాటు బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాణాఘాట్‌ నియోజకవర్గంలోని కృష్ణానగర్‌ ప్రాంతానికి అర్నబ్‌ రాయ్‌(30)ను ఈసీ నోడల్‌ అధికారిగా నియమించింది. ఈ నేపథ్యంలో గత గురువారం ఇక్కడి బిప్రదాయ్‌ చౌదరీ పాలిటెక్నిక్‌ కాలేజీలో విధుల నిర్వహణకు కారులో బయలుదేరారు. అయితే ఎన్నికల విధులకు హాజరైన రాయ్, తిరిగి ఇంటికి రాలేదు. ఆయన కారు మాత్రం పాలిటెక్నిక్‌ కళాశాల ముందు లభ్యమైంది.అదృశ్యంపై నివేదిక సమర్పించాలని ఈసీ జిల్లా మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top