మాదాపూర్‌లో మహిళ హంగామా

Drunken Woman Hulchal In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ హంగామా సృష్టించింది. అతివేగంగా కారు నడుపుతూ మరో ఆడీ కారును ఢీకొట్టింది. మాదాపూర్‌లోని బెంజ్‌ షోరూం వద్ద నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. రెండు కార్లకు చెందిన మహిళలు ఒకరిపై ఒకరు మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్న సమయంలోనే ఆ మహిళ హంగామా చేసింది. ఆ మహిళ తాగి ఉన్నట్లు అనుమానం రావడంతో పోలీసులు బ్రీత్‌ అనలైజర్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఆ టెస్ట్‌లో మహిళకు 130 పాయింట్లు వచ్చాయి. మహిళతో పాటు మరో వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top