డ్రగ్స్‌ కేసులో యంగ్ విలన్‌ అరెస్ట్‌ | Dookudu Actor Ajaz Khan Arrested for Illegal Possession of Drugs | Sakshi
Sakshi News home page

Oct 23 2018 12:08 PM | Updated on Oct 23 2018 1:54 PM

Dookudu Actor Ajaz Khan Arrested for Illegal Possession of Drugs - Sakshi

దూకుడు, నాయక్‌, బాద్‌షా లాంటి సినిమాల్లో ప్రతినాయకుడిగా కనిపించిన బాలీవుడ్ నటుడు అజాజ్‌ ఖాన్‌. బిగ్‌బాస్‌ టీవీ షోతో పాపులర్‌ అయిన ఈ యువ నటుడు సినిమాలతో కన్నా ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో కనిపిస్తుంటాడు. ఇప్పటికే పలుమార్లు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఈ అజాజ్‌ తాజా డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ అయ్యాడు.

నిషేదిత ఉత్ర్పేరకాలు కలిగి ఉన్న కారణంగా అజాజ్‌ ఖాన్‌ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. 2.3 గ్రాముల 8 మాత్రలు అజాజ్‌ దగ్గర ఉన్నట్టుగా పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్‌లో పాటు 2.2 లక్షల నగదు, సెల్‌ఫోన్స్‌ను కూడా నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అజాజ్‌ను ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement