దివ్య హత్య అత్యంత క్రూరమైంది..

Divya murder case:They killed her brutally, says Visakha CP RK Meena - Sakshi

సాక్షి, విశాఖ : నగరంలో దారుణంగా హత్యకు గురైన దివ్య హత్య కేసులో రెండవ రోజు విచారణ కొనసాగుతుంది. ప్రధాన నిందితురాలు వసంత, ఆమెకు సహకరించిన గీత అలియాస్ కుమారి లను పోలీసులు కస్టడీ లో తీసుకుని విచారిస్తున్నారు. వసంత ఫోన్ కాల్ డేటా ను తీసుకున్నారు. అయితే దివ్యను చంపిన తర్వాత నిందితురాలు వసంత  మొబైల్‌లో ఉన్న కాల్ డేటా మొత్తాన్ని ఓ మొబైల్ దుకాణానికి తీసుకు వెళ్లి డిలీట్ చేయించినట్లు ఇంటరాగేషన్‌లో తేలింది. దీంతో సదరు మొబైల్ దుకాణ యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. (దివ్య హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్)

ఈ సందర్భంగా దివ్య హత్యకేసు విచారణపై నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కే మీనా గురువారమిక్కడ మాట్లాడుతూ.. నిందితులు వసంత, గీతను కస్టడీకి తీసుకున్నాం. మిగిలిన నలుగురు నిందితులను కూడా పోలీస్‌ రిమాండ్‌కు అప్పగించమని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాం. న్యాయస్థానం అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకుంటాం. దివ్య హత్య అత్యంత క్రూరమైంది. ఆమెకు ఆరురోజుల పాటు తిండి పెట‍్టకుండా చాలా హింసించారు. (కస్టడీకి దివ్య హత్య కేసు నిందితులు!)

ఈ హత్య వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో ఆరా తీస్తున్నాం. దివ్య తల్లి, సోదరుడు, అమ్ముమ్మ ఓ రౌడీ షీటర్‌ చేతిలో హత్యకు గురైనట్లు నిందితులు చెబుతున్నారు. అయితే వాళ్లు హత్యకు గురయ్యారా? లేక అదృశ్యమయ్యారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం.’ అని తెలిపారు. సీపీ అంతకు ముందు ఫోర్త్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆకస్మికంగా పర్యటించారు. అక్కడ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. (దివ్య హత్య కేసు: సంచలన నిజాలు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top