లిస్బన్‌ క్లబ్‌ ఘటన.. డీజీపీ ఆరా

DGP Mahender Reddy Focus On Attack On Pub Dancer - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని లిస్బన్‌ క్లబ్‌ ఘటనపై డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆరా తీశారు. క్లబ్‌ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న హరిణి అనే యువతిని అసాంఘిక కార్యకలాపాలు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడం, దానికి ఆ యువతి ఒప్పుకోకపోవడంతో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలు 100కు ఫోన్‌ చేసిన తరువాత అక్కడికి వచ్చిన పోలీసులు తనను కాపాడకపోగా, దాడి చేసినవారికి వత్తాసు పలికారని ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా డీజీపీ ఆదేశించారు. పంజాగుట్ట సీఐతో మాట్లాడిన డీజీపీ.. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. కేసుకు సంబంధించిన నివేదిక త్వరగా అందించాలని ఆదేశించారు.

బాధితురాలు చేసిన ఆరోపణలు నిజమైతే సదరు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పంజగుట్ట ఏసీపీ తిరుపతన్న ఇదివరకే తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురు మహిళలను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు సయీద్‌ తప్పించుకున్నాడని, అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు.

చదవండి : బట్టలూడదీసి పబ్‌ డ్యాన్సర్‌ను కొట్టారు..!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top