అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు | Car Roll qovered on Foot Path NTR Gardens | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు

Apr 15 2019 7:04 AM | Updated on Apr 15 2019 7:04 AM

Car Roll qovered on Foot Path NTR Gardens - Sakshi

ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు

ఖైరతాబాద్‌: అదుపుతప్పిన వేగంతో వచ్చిన కారు ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన ఘటన ఎన్టీఆర్‌ గార్డెన్‌ సమీపంలో చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఐమాక్స్‌ రోటరీ చౌరస్తా వైపు వస్తున్న హోండా క్రిస్టా కారు (టిఎస్‌07 యుహెచ్‌2043) ఎన్టీఆర్‌ గార్డెన్‌ దాటగానే అదుపు తప్పిన వేగంతో రోడ్డు పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. కారులో భార్యాభర్తతో పాటు రెండు సంవత్సరాల బాబు ఉన్నారు. బాబు తలకు తీవ్రగాయాలయ్యాయి. భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వీరు కారులోంచి దిగి ఆటోలో సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే కారును క్రేన్‌ సాయంతో అక్కడి నుంచి తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement