నడుస్తున్న కారులో మంటలు | Car Burned In Rangareddy | Sakshi
Sakshi News home page

నడుస్తున్న కారులో మంటలు

Aug 10 2018 8:57 AM | Updated on Aug 14 2018 3:22 PM

Car Burned In Rangareddy - Sakshi

మంటలంటుకుని కాలిపోతున్న కారు

బొంరాస్‌పేట : నడుస్తున్న కారులో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం మండల పరిధిలోని మెట్లకుంట చెక్‌పోస్టు వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సందీప్‌ బంధువుల పెళ్లి పత్రికలు పంచేందుకు తన కారులో కొడంగల్‌ వైపు వెళ్తున్నారు.

బొంరాస్‌పేట చెక్‌పోస్ట్‌ వద్ద హైదరాబాద్‌–బీజాపూర్‌ రహదారిపై సందీప్‌ ప్రయాణిస్తున్న మారుతి కారు (ఏపీ09జెడ్‌ 4095)లో నుంచి అకస్మాత్తుగా పొగ రావడంతో కారును పక్కకు నిలిపివేశారు. మెల్లగా మంటలు రావడంతో కారులో ఉన్న సందీప్‌తో పాటు మరో ఇద్దరు దూరంగా పరుగులు తీశారు. పెద్ద పెద్ద మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి మంటలను అదుపుచేశారు. కారులో ఏసీ సమస్య వల్ల ప్రమాదం జరిగిందని పోలీసుల విచారణ తేలింది. 

Advertisement
 
Advertisement
Advertisement