టెన్త్‌ ఫెయిల్‌ అవుతానన్న భయంతో..

A Boy Committed Suicide  In Hyderabad Because He Might Fail In 10th Exams - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : త్వరలో రానున్న పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్‌ అవుతానన్న అనుమానంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని ఉప్పుగూడకు చెందిన నరేష్‌(16) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలె పదో తరగతి పరీక్షలు రాసిన ఆ బాలుడు.. ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. తాను ఫెయిల్‌ అవుతానని భయపడ్డ బాలుడు ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలించాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంధ్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న ఛత్రినాక పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top