వృద్ధురాలిపై అత్యాచారం కేసులో బాలుడి అరెస్ట్‌! | boy arrested for the rape case | Sakshi
Sakshi News home page

వృద్ధురాలిపై అత్యాచారం కేసులో బాలుడి అరెస్ట్‌!

Jan 23 2018 11:28 AM | Updated on Jul 12 2019 3:02 PM

boy arrested for the rape case - Sakshi

సాక్షి, నెల్లూరు : తోటపల్లిగూడూరు మండలంలోని చింతోపులో ఓ వృద్ధురాలిపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన బాలుడిని అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై శివకృష్ణారెడ్డి తెలిపారు. ఎస్సై కథనం మేరకు.. మండలంలోని చింతోపు ఎస్సీ కాలనీలో 82 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. ఈ నెల 15వ తేదీ రాత్రి అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడు వృద్ధురాలు ఇంటికెళ్లి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 16వ తేదీన అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. నెల్లూరు రూరల్‌ డీఎస్పీ రాఘవరెడ్డి సోమవారం నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement