పసికందు మాయం..  | Babe disappears | Sakshi
Sakshi News home page

పసికందు మాయం.. 

May 3 2018 12:00 PM | Updated on May 3 2018 12:00 PM

Babe disappears - Sakshi

లంగర్‌హౌస్‌: పట్టపగలు తల్లితో కలిసి నిద్రిస్తున్న రెండు నెలల పసికందు అపహరణకు గురైన సంఘటన లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం  చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ అంజయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జడ్చర్లకు చెందిన కవిత నగరానికి వచ్చి కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తుంది.

ఇలా పరిచమైన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోగా నెలరోజుల క్రితం భర్త మరణించాడు. బుధవారం మధ్యాహ్నం కుమారుడితో కలిసి రాంలీలా మైదానంలోని చింతచెట్టు కింద నిద్రిస్తున్న ఆమె మెలుకువ వచ్చి చూసే సరికి బాబు కనిపించలేడు. దీంతో లంగర్‌హౌస్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.   

Advertisement
 
Advertisement
Advertisement