సాక్షి, మిర్యాలగూడ: మిర్యాలగూడ ఏడుకోట్ల తండా వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ మృతిచెందారు. మంచు కారణంగా దారి కనిపించక ఆగిఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ద్విచక్రవాహనంపై వెళుతున్న వేములపల్లి ఏఎస్‌ఐ మస్తాన్‌అలీ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మస్తాన్‌అలీ మృతి చెందారు. విధులు ముగించుకుని వేములపల్లి నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మస్తాన్‌అలీ సూర్యపేట జిల్లా నేరేడుచర్ల మండలం సోమారం గ్రామానికి చెందినవారు.