ఏసీబీ దాడులు..రూ.8కోట్ల అక్రమ ఆస్తులు

ACB Raids On Kurnool Motor Vehicle Inspector Shiva Prasad - Sakshi

మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ నివాసంపై ఏసీబీ దాడి

సాక్షి, కర్నూలు : ఏసీబీ అధికారుల ముందు అవినీతి దొంగ వ్యవహారం బట్టబయలైంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాయన్న ఆరోపణలతో  కర్నూలు మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ ఎ.శివ ప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో  పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. కర్నూలు, హైదరాబాద్‌, బెంగుళూరుతోపాటు మొత్తం అయిదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ. 8 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. అంతేగాక ఇతని పేర దాదాపు రూ. 20 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఏసీబీ సోదాలు సాయంత్రం వరకూ కొనసాగే అవకాశం ఉంది.

  శివప్రసాద్‌ అక్రమ ఆస్తులు చిట్టా..
► బెంగళూరులోని కార్తీక్ నగర్‌లో మూడు కోట్ల విలువైన జీప్లస్ సెవెన్ అపార్ట్ మెంట్, ఉదాల్ హల్లిలో రెండు కోట్ల విలువ చేసే ఇంటి స్థలం. 
► హైదరాబాద్‌లోని జయభేరి ఆరెంజ్ ఆర్కేట్ లో కోటిన్నర విలువచేసే అపార్ట్‌మెంట్‌, గాజుల మల్లాపురంలో కోటి రూపాయల ఇంటి స్థలం.
 ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంట్లో రూ.1.45 లక్షల నగదు, కిలో బంగారం లభించింది. 
మనీ ట్రాన్స్‌ఫర్ కోసం భార్య పేరు మీద ఆక్సీ ట్రీ హోటల్ ప్రైవేట్‌ లిమిటెడ్ , సిన్బిడ్స్ అనే రెండు సూట్ కేసు కంపెనీల స్ధాపన.
యుగాండా దేశంలోని  బ్యాంకుల్లో లాకర్స్ ఉన్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top