ముక్కు ఆపరేషన్‌ కోసం వెడితే దారుణం

7Year-Old Goes For Nasal Surgery Gets Operated for Hernia  - Sakshi

వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట 

ఏడేళ్ల బాలుడికి  హెర్నియా ఆపరేషన్‌

వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ ఘటన.ముక్కు ఆపరేషన్‌కోసం ఆసుపత్రిలో చేరిన బాలుడికి హెర్నియా ఆపరేషన్‌ నిర్వహించిన ఘటన కలకలం రేపింది. కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే హెర్నియా ఆపరేషన్‌ కోసం ధనుష్‌ మరో రోగి ఇదే ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో ఇద్దరు రోగుల మధ్య కన్‌ఫ్యూజన్‌కు లోనైన వైద్యులు..ఒకటికి నాలుగు సార్లు ధృవీకరించుకోవాల్సింది పోయి.. వెనకా ముందు చూడకుండా బాలుడికి శస్త్ర చికిత్స పూర్తి చేశారు. దీంతో ముక్కు ప్రాంతంలో (నాసిల్‌ ఫాలిప్స్‌)సర్జరీ  జరగాల్సిన తమ కుమారుడు మహ్మమద్‌ డానిష్‌ (7) పొట్టపై కుట్లు ఉండటం  చూసి తల్లితండ్రులు షాక్‌ అయ్యారు. దీంతో ఆసుపత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. 

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు బాధపడకూడదని  అని రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి కె.కె.శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో  సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు  ఈ కేసులో బాధ్యతా రాహిత్యంగా వ్యవరించిన డాక్టర్ ఎ సురేష్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. బాధిత బాలుడికి ఉచిత​ చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. అటు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా వైద్య కళాశాల సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.

Election 2024

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top