తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం | 6 killed, 7 injured in Thoothukudi accident | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

Jan 17 2018 8:23 AM | Updated on Aug 30 2018 4:17 PM

6 killed, 7 injured in Thoothukudi accident  - Sakshi

చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుత్తుకుడి జిల్లా దళవాయుపురం వద్ద ఓ వ్యాన్‌ అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు చెందినవారు. వీరంతా కన్యాకుమారి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement