జొమాటో చేతికి ఉబెర్‌ ఈట్స్‌ | Zomato Acquires Uber Eats | Sakshi
Sakshi News home page

జొమాటో చేతికి ఉబెర్‌ ఈట్స్‌

Jan 22 2020 3:08 AM | Updated on Jan 22 2020 3:08 AM

Zomato Acquires Uber Eats - Sakshi

న్యూఢిల్లీ: ఉబెర్‌ ఈట్స్‌ భారత వ్యాపారాన్ని సొంతం చేసుకున్నట్టు ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్ల స్వీకరణ, డెలివరీ సంస్థ జొమాటో స్పష్టంచేసింది. ఫలితంగా ఉబెర్‌ ఈట్స్‌కు జొమాటోలో 9.99 శాతం వాటా దక్కనుంది. ఈ కొనుగోలుతో ఉబెర్‌ ఈట్స్, ఉబెర్‌ యాప్‌ల ద్వారా ఫుడ్‌ డెలివరీ, ఆర్డర్ల స్వీకరణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉబెర్‌ ఈట్స్‌ యాప్‌ యూజర్లు, డెలివరీ భాగస్వాములు, రెస్టారెంట్లను జొమాటో ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించామని, మంగళవారం నుంచే ఇది అమల్లోకి వచ్చిందని జొమాటో ఒక ప్రకటనలో తెలియజేసింది.

తీవ్ర పోటీ, ధరల పరంగా సున్నితమైన ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ మార్కెట్లో తాజా డీల్‌తో స్థిరీకరణకు అవకాశం ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. కాగా ఈ లావాదేవీతో జొమాటోలో తమకున్న వాటా 22.71%కి తగ్గుతుందని ఇన్ఫోఎడ్జ్‌ బీఎస్‌ఈకి తెలియజేసింది. ఈ డీల్‌ అనంతరం జొమాటో విలువ 3.55 బిలియన్‌ డాలర్లుగా  అంచనా. జొమాటో తన ప్లాట్‌ఫామ్‌పై ప్రతినెలా 5 కోట్లకు పైగా ఆర్డర్లతో, 55 శాతం మార్కెట్‌తో అగ్రగామి కంపెనీగా అవతరించినట్టయింది. ఇప్పటిదాకా స్విగ్గీ నంబర్‌వన్‌ స్థానంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement