అమెజాన్ అమ్మకాల్లో విశాఖ టాప్ | Vishaka top in Amazon sales | Sakshi
Sakshi News home page

అమెజాన్ అమ్మకాల్లో విశాఖ టాప్

Sep 23 2016 2:27 AM | Updated on May 25 2018 7:14 PM

అమెజాన్ అమ్మకాల్లో విశాఖ టాప్ - Sakshi

అమెజాన్ అమ్మకాల్లో విశాఖ టాప్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాము జరుపుతున్న అమ్మకాల్లో విశాఖ నగరం ప్రథమ స్థానంలో ఉందని అమెజాన్ ఇండియా కేటగిరీ లీడర్ మయాంక్ శివమ్ తెలిపారు.

* పండుగ సీజన్‌కు 15వేల బ్రాండ్ల ఉత్పత్తులు
* ‘అమెజాన్ ఇండియా’ కేటగిరి లీడర్ మయాంక్ శివమ్

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాము జరుపుతున్న అమ్మకాల్లో విశాఖ నగరం ప్రథమ స్థానంలో ఉందని అమెజాన్ ఇండియా కేటగిరీ లీడర్ మయాంక్ శివమ్ తెలిపారు. విశాఖ తరువాత స్థానాల్లో విజయవాడ, గుంటూరు, నెల్లూరు  ఉన్నాయన్నారు. గురువారం ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడారు. అమెజాన్ మొత్తం అమ్మకాల్లో 30 శాతం వాటా ఫ్యాషన్ ఉత్పత్తులదేనని, గతేడాది యూనిట్ విక్రయాల్లో 200 శాతం అభివృద్ధి సాధించామన్నారు. గతేడాది సీజన్ అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది జూన్ సీజన్ అమ్మకాల ముగింపులో 1.5 రెట్లు వృద్ధి వైజాగ్ నగరంలో కనిపించిందన్నారు.

పండుగ సీజన్ కోసం 15వేల బ్రాండ్లు, రెండు మిలియన్లకు పైగా ఫ్యాషన్ ఉత్పత్తులను అమెజాన్ సిద్ధం చేసిందన్నారు. మారుమూల ఖాతాదారులకు అతి తక్కువ సమయంలో డెలివరీ చేసేందుకు వీలుగా ఇండియా పోస్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు. తమకు బెంగుళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై నగరాల్లో ఫ్యాషన్ స్టూడియోలు ఉన్నాయని, భవిష్యత్‌లో వాటిని మరింతగా విస్తరిస్తామని అన్నారు. ఈ సమావేశంలో అమెజాన్ ఇండియా ఫ్యాషన్ ప్రతినిధి ప్రియాంక బేడీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement