ఆధార్‌పై బ్యాంకులకు అదనపు గడువు

UIDAI relaxes Aadhaar enrolment targets for banks - Sakshi

నవంబర్‌ 1 వరకు అవకాశం ఇచ్చిన యూఐడీఏఐ

న్యూఢిల్లీ: ఖాతాదారుల ఆధార్‌ నమోదు విషయంలో బ్యాంకులకు వెసులుబాటు లభించింది. గడువును నవంబర్‌ 1 వరకు పొడిగిస్తూ యూఐడీఏఐ బ్యాంకులకు సమాచారం ఇచ్చింది. ఎంపిక చేసిన ప్రతి శాఖలో జూలై 1 నుంచి ప్రతి రోజు కనీసం ఎనిమిది ఆధార్‌ నమోదులు లేదా అప్‌డేషన్‌ చేసేలా చూడాలని బ్యాంకులను యూఐడీఏఐ ఈ ఏడాది జూన్‌లో కోరింది. అక్టోబర్‌ నుంచి ప్రతీ రోజూ 12 నమోదులు, 2019 జనవరి నుంచి రోజూ 16కు తీసుకెళ్లాలని ఆదేశించింది.

నిబంధనలను పాటించకపోతే ఆర్థిక పరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. అయితే, ఈ లక్ష్యాలను సవరిస్తూ తాజాగా యూఐడీఏఐ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. నవంబర్‌ నుంచి నిత్యం 8తో ప్రారంభించి, జనవరిలో 12కు, ఏప్రిల్‌ నుంచి 16కు పెంచాలని కోరింది. ఈ లక్ష్యాలను బ్యాంకులు చేరుకుంటాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. కేరళ, పలు ఇతర రాష్ట్రాల్లో విపత్తుల కారణంగా గడువును, లక్ష్యాలను సడలించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top