వృద్ధి కథ.. బాలీవుడ్‌ సినిమాయే! | Uday Kotak Satire on GDP Growth | Sakshi
Sakshi News home page

వృద్ధి కథ.. బాలీవుడ్‌ సినిమాయే!

Sep 12 2019 10:51 AM | Updated on Sep 12 2019 10:51 AM

Uday Kotak Satire on GDP Growth - Sakshi

ముంబై: మన దేశ వృద్ధి కథ అచ్చం బాలీవుడ్‌ సినిమాలాగానే ఉందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌  చైర్మన్‌ ఉదయ్‌ కోటక్‌ వ్యాఖ్యానించారు. భారత్‌లోని ప్రస్తుత ఆరి్థక పరిస్థితులు సినిమాను తలపించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఆరంభంలో ప్రేమ కధలాగానే వృద్ది జోరుగానే మొదలైందని, ఆ తర్వాత మందగమనం రూపంలో విలన్‌ ఎదురయ్యాడని, దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారని వివరించారు. ఈ మందగమన విలన్‌ను ఎదుర్కొనడానికి భారత్‌ తన ప్రయత్నాలు తాను చేయాలని సూచించారు. తర్వాత తర్వాత పరిస్థితులు చక్కబడుతాయని పేర్కొన్నారు. సినిమాలు సుఖాంతమైనట్లే, మన వృద్ధి కథ కూడా శుభప్రదంగానే ఉంటుందని చెప్పారు. ప్రస్తుత ఆరి్థక స్థితిగతులు సమస్యాత్మకంగానే ఉన్నప్పటికీ, అందరూ భయపడుతున్నంత అధ్వానంగా మాత్రం లేవని వివరించారు. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ కళ్లతో చూస్తే, భారత వృద్ధి కధ గగుర్పొడిచేలా ఉందని పేర్కొన్నారు. 

మీరు చేస్తున్న పనినే కొనసాగించండి. సరైన సమయంలో రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధమైతే, దీర్ఘకాలంలో మంచి ఫలితాలే పొందవచ్చని ఉదయ్‌ కోటక్‌  వ్యాఖ్యానించారు. ఏ దేశమూ ఇవ్వనన్ని గొప్ప అవకాశాలు భారత్‌లో కోకొల్లలుగా ఉన్నాయని వివరించారు. భారత్‌లో ఇలాంటి మందగమన పరిస్థితులు సాధారణమేనని, ప్రతి కొన్నేళ్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు. సాధారణంగా 8తో ముగిసే సంవత్సరాల్లో సంక్షోభాలు వచ్చాయని పేర్కొన్నారు. 1998లో ఆసియా సంక్షోభం తర్వాత భారత్‌లో ఆరి్థక అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని గుర్తు చేశారు. 2008లో అంతర్జాతీయంగా ఆరి్థక సంక్షోభం అతలాకుతలం చేసిందని, 2018లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంతో ముసలం మొదలైందని ఉదయ్‌ కోటక్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement