టాటా స్టీల్‌ చేతికి భూషణ్‌ స్టీల్‌ | Sakshi
Sakshi News home page

టాటా స్టీల్‌ చేతికి భూషణ్‌ స్టీల్‌

Published Fri, Mar 23 2018 1:37 PM

Tata Steel is picked as successful applicant to buy Bushan Steel - Sakshi

సాక్షి, ముంబై: మొత్తానికి  భూషణ్‌ స్టీల్‌ విక్రయానికి మార్గం సుగమమైంది. సుమారు రూ.50వేల కోట్ల రుణభారంతో సతమతమవుతూ.. దివాలా చట్ట పరిధిలోకి చేరిన భూషణ్‌ స్టీల్‌ కొనుగోలుకి వేసిన బిడ్‌ గెలుపొందినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు  అందించిన స​మాచారంలో టాటా స్టీల్‌ తాజాగా తెలియజేసింది. ఈ మేరకు మార్చి 22న భూషణ్ స్టీల్ లిమిటెడ్ (బీఎస్ఎల్) కు చెందిన క్రెడిట్ కమిటీల (కోసీ) నిర్ణయం తీసుకుందని  టాటాస్టీల్ పేర్కొంది. అయితే ఈ డీల్‌ రెగ్యులేషన్‌ కమిటీ ఆమోదానికి లోబడి ఉంటుందని  తెలిపింది. 

జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ), కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) తదితర నియంత్రణ సంస్థల నుంచి తగిన అనుమతులు లభించాల్సి ఉందని టాటాస్టీల్‌ పేర్కొంది. రుణ చెల్లింపుల్లో విఫలంకావడంతో భూషణ్‌ స్టీల్‌పై బ్యాంకులు దివాలా చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో  వార్షికంగా 5.6 మిలియన్‌ టన్నుల సామర్థ్యమున్న భూషణ్‌ స్టీల్‌ కొనుగోలుకి పలు సంస్థలు ఆసక్తి చూపాయి. అయితే  అనూహ్యంగా టాటా గ్రూప్‌ మెటల్‌ దిగ్గజం టాటా స్టీల్‌ రూ. 35వేల కోట్ల  బిడ్‌తో ఒక్కసారిగా ముందుకొచ్చింది. తద్వారా ఈ బిడ్‌లో  ముందంజలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ (బిడ్‌  వాల్యూరూ. 29,700 కోట్లు) వెనక్కి నెట్టేసింది. కాగా.. ప్రస్తుతం టాటా స్టీల్‌, భూషణ్‌ స్టీల్‌  షేర్లు నష్టాల్లోకదులుతున్నాయి.

Advertisement
Advertisement