
టిగోర్ కారుతో ప్రతాప్ బోస్
వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఏటా రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనుంది.
♦ 2019 నాటికి మూడో స్థానానికి
♦ టాటా మోటార్స్ డిజైన్ హెడ్ ప్రతాప్ బోస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఏటా రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం దేశీయ ప్యాసింజర్ కార్ల విపణిలో 5 శాతం వాటాతో కంపెనీ నాల్గవ స్థానంలో ఉంది. 2019 నాటికి మూడో స్థానాన్ని లక్ష్యంగా చేసుకున్నామని టాటా మోటార్స్ డిజైన్ హెడ్ ప్రతాప్ బోస్ తెలిపారు. టిగోర్ కారును మంగళవారమిక్కడ ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కార్ల పరిశ్రమలో ప్రస్తుతం 60 శాతం విభాగాల్లో మోడళ్లను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.
ఇతర విభాగాల్లోనూ దశలవారీగా అడుగు పెడతామని తెలిపారు. కంపెనీ విడుదల చేసే ప్రతి కారు ఒక కొత్త విభాగాన్ని సృష్టించాలన్నదే తమ ధ్యేయమని వివరించారు. ఇటీవల విడుదల చేసిన టియాగో కారుకు 83,000 బుకింగ్స్ నమోదయ్యాయని అన్నారు. కాగా, టిగోర్ ధర హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో వేరియంట్‌నుబట్టి పెట్రోల్ రూ.4.85 లక్షల నుంచి రూ.6.4 లక్షలు, డీజిల్ రూ.5.77 లక్షల నుంచి రూ.7.31 లక్షలు ఉంది.