breaking news
Pratap Bose
-
4 ఏళ్లలో టాటా మోటార్స్ 14 కొత్త కార్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కొత్త మోడళ్లతో రంగంలోకి దిగుతోంది. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్‌పోలో 26 నూతన వాహనాలను ప్రదర్శించనుంది. వీటిలో 14 వాణిజ్య, 12 ప్యాసింజర్ వెహికల్స్ ఉండబోతున్నాయి. ఎక్స్పో వేదికగా అంతర్జాతీయ విపణిలోకి కంపెనీ నాలుగు వాహనాలను ఆవిష్కరిస్తుంది. భారత్‌లో వచ్చే మూడు నాలుగేళ్లలో 12–14 సరికొత్త కార్లు రోడ్డెక్కనున్నాయి. ఆల్ఫా, ఒమేగా ప్లాట్‌ఫామ్స్‌పై కొత్త ప్యాసింజర్ కార్లు రూపుదిద్దుకుంటాయని టాటా మోటార్స్ గ్లోబల్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ బోస్ శుక్రవారం వెల్లడించారు. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ కారును ఇక్కడి మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆల్ఫా ఆర్కిటెక్చర్‌పై తయారైన తొలి కారు ఆల్ట్రోజ్ అని చెప్పారు. నెక్సాన్ ఎలక్ట్రిక్ కారును ఈ నెల 28న విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఏడు సీట్లతో రూపుదిద్దుకున్న గ్రావిటాస్ ఎస్యూవీ త్వరలో రానుందన్నారు. ఆల్ట్రోజ్ కారుతో ప్రతాప్ బోస్, రీజినల్ హెడ్ నిథున్ శర్మ (కుడి) -
ఏటా రెండు కొత్త మోడళ్లు
♦ 2019 నాటికి మూడో స్థానానికి ♦ టాటా మోటార్స్ డిజైన్ హెడ్ ప్రతాప్ బోస్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఏటా రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం దేశీయ ప్యాసింజర్ కార్ల విపణిలో 5 శాతం వాటాతో కంపెనీ నాల్గవ స్థానంలో ఉంది. 2019 నాటికి మూడో స్థానాన్ని లక్ష్యంగా చేసుకున్నామని టాటా మోటార్స్ డిజైన్ హెడ్ ప్రతాప్ బోస్ తెలిపారు. టిగోర్ కారును మంగళవారమిక్కడ ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కార్ల పరిశ్రమలో ప్రస్తుతం 60 శాతం విభాగాల్లో మోడళ్లను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఇతర విభాగాల్లోనూ దశలవారీగా అడుగు పెడతామని తెలిపారు. కంపెనీ విడుదల చేసే ప్రతి కారు ఒక కొత్త విభాగాన్ని సృష్టించాలన్నదే తమ ధ్యేయమని వివరించారు. ఇటీవల విడుదల చేసిన టియాగో కారుకు 83,000 బుకింగ్స్ నమోదయ్యాయని అన్నారు. కాగా, టిగోర్ ధర హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో వేరియంట్‌నుబట్టి పెట్రోల్ రూ.4.85 లక్షల నుంచి రూ.6.4 లక్షలు, డీజిల్ రూ.5.77 లక్షల నుంచి రూ.7.31 లక్షలు ఉంది.