మార్కెట్లోకి సుజుకీ ‘జిక్సర్‌ 250’ 

Suzuki Gixxer 250 Launched In Market - Sakshi

ధర రూ.1,59,800 

న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా (ఎస్‌ఎంఐపీఎల్‌)..‘జిక్సర్‌–250’ మోడల్‌ బైక్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.ఫోర్‌–స్ట్రోక్‌ 249సీసీ ఇంజిన్‌తో విడుదలైన ఈ బైక్‌ ధర రూ.1,59,800 (ఢిల్లీఎక్స్‌షోరూం)గా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. మెరుగైన బ్రేకింగ్‌ వ్యవస్థను అందించడంలో భాగంగా డ్యూయల్‌ ఛానల్‌ యాంటీ–లాక్‌ బ్రేక్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌) అమర్చినట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఎస్‌ఎంఐపీఎల్‌ హెడ్‌ కోచిరో హిరావ్‌ మాట్లాడుతూ..‘అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుజుకీ సంస్థ మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేస్తుందనే అంశానికి ఈ నూతన బైక్‌ అద్దం పడుతోంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నూతన బైక్‌ల విడుదలతో మా వృద్ధి వేగాన్ని కొనసాగిస్తాం’ అని వ్యాఖ్యానించారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top