కుట్ర జరుగుతోంది..  జోక్యం చేసుకోండి 

Sun Pharma denies getting new whistleblower complaint, says not privy to content  - Sakshi

సెబీని కోరిన సన్‌ ఫార్మా 

కంపెనీపై రెండో ప్రజావేగు ఫిర్యాదు

8 శాతం పతనమైన షేరు  

న్యూఢిల్లీ: కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు తమ కంపెనీకి, కంపెనీ వాటాదారులకు నష్టం కలిగించే, విద్వేషపూరిత విధానాలకు పాల్పడుతున్నారంటూ మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి ఫార్మా దిగ్గజం సన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఫిర్యాదు చేసింది. ఈ విషయమై జోక్యం చేసుకోవాలని సెబీని చైర్మన్‌ అజయ్‌ త్యాగిని కోరుతూ సన్‌ ఫార్మా ఒక లేఖ రాసింది. నిరాధారమైన ఫిర్యాదులు, ఆరోపణల కారణంగా వాటాదారుల విలువ భారీగా హరించుకుపోయిందని ఈ లేఖలో కంపెనీ పేర్కొంది.  

ఈ కుట్రలో కొన్ని మీడియా సంస్థల, వ్యక్తుల పాత్ర ఉందని ఈ విషయమై పూర్తిగా విచారణ జరపాలని కోరింది. సన్‌ ఫార్మాకు వ్యతిరేకంగా సెబీకి రెండో ప్రజావేగు ఫిర్యాదు అందిందన్న వార్తల నేపథ్యంలో సన్‌ ఫార్మా షేర్‌ భారీగా నష్టపోయింది. కంపెనీకి వ్యతిరేకంగా సెబీకి అందిన రెండో ఫిర్యాదు ఇది.  తాజా వార్తలతో శుక్రవారం ఈ కంపెనీ షేర్‌ 8% క్షీణించి రూ.390 వద్ద ముగిసింది. ఒక్క రోజులోనే  ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.8,735 కోట్లు ఆవిరైంది. 

 

 

Election 2024

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top