స్టాక్స్‌ వ్యూ

 Stocks view in this week - Sakshi

యాక్సిస్‌ బ్యాంక్‌
కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ 
ప్రస్తుత ధర: రూ.574     టార్గెట్‌ ధర: రూ.670 
ఎందుకంటే: కొత్త తరం ప్రైవేట్‌ బ్యాంక్‌లకు సంబంధించి అతిపెద్ద బ్యాంక్‌ల్లో ఇది కూడా ఒకటి. ఈ ఏడాది మార్చి నాటికి 3,703 బ్రాంచ్‌లతో, 13,814 ఏటీఎమ్‌లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. యాక్సిస్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయ వృద్ధి నిలకడగా ఉండటంతో నికర లాభం రూ.701 కోట్లకు పెరిగింది. రుణ నాణ్యత ఒకింత మెరుగుపడింది. నికర వడ్డీ ఆదాయం 12 శాతం (క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ పరంగా 9 శాతం) వృద్ధితో రూ.5,170 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన 13 బేసిస్‌ పాయింట్లు పెరిగి 3.46 శాతానికి చేరింది.  కార్పొరేట్‌ ఫీజు ఆదాయం 24 శాతం తగ్గగా, రిటైల్‌ ఫీజు ఆదాయం 18 శాతం ఎగసింది. మొత్తం మీద ఫీజు ఆదాయ వృద్ధి 5 శాతంగా నమోదైంది. రిటైల్‌ రుణాలు 21 శాతం, ఎస్‌ఎమ్‌ఈ రుణాలు 19 శాతం పెరగడంతో 14 శాతం రుణ వృద్ధి సాధించింది. క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ పరంగా డిపాజిట్లు 1 శాతం తగ్గగా, టర్మ్‌ డిపాజిట్లు 13 శాతం పెరిగాయి. స్థూల, నికర మొండి బకాయిలు సీక్వెన్షియల్‌గా తగ్గాయి. మార్చి క్వార్టర్‌లో 6.77 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ జూన్‌ క్వార్టర్‌లో 6.52 శాతానికి తగ్గాయి. అలాగే నికర మొండి బకాయిలు 3.4 శాతం నుంచి 3.09 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 83 శాతానికి ఎగసింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం నుంచి రుణ వృద్ధి జోరుగా పెరగవచ్చని భావిస్తున్నాం. టైర్‌–1 మూలధనం 13.2 శాతంగా ఉండటంతో వృద్ధికి తగిన పెట్టుబడులు అందుబాటులో ఉన్నాయని చెప్పవచ్చు. ఇతర కార్పొరేట్‌ బ్యాంక్‌లతో పోల్చితే రుణ నాణ్యత మెరుగుపడటం, మార్జిన్లు బాగా వచ్చే రిటైల్‌ రుణాలపై బ్యాంక్‌ దృష్టి పెట్టటం సానుకూలాంశాలు.  

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌
కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ 
ప్రస్తుత ధర: రూ.965     టార్గెట్‌ ధర: రూ.1,155 
ఎందుకంటే: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు సామాన్యంగా ఉన్నాయి. మెరుపులూ లేవు. అలాగని నిరాశాజనకంగానూ లేవు. అయితే డీల్స్‌ సాధించడం, భవిష్యత్తు ఆదాయ అంచనాలు ఆశావహంగా ఉన్నాయి. ఆదాయం 3 శాతం (క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన 9 శాతం) వృద్ధితో 205.5 కోట్ల డాలర్లకు పెరిగింది. పన్ను రేట్లు తక్కువగా ఉండటంతో సవరించిన నికర లాభం రూ.2,403 కోట్లకు చేరింది. ఈ క్యూ1లో అత్యధిక డీల్స్‌(27) సాధించింది. కంపెనీ చరిత్రలో అత్యధిక డీల్స్‌ సాధించిన 
క్వార్టర్‌ ఇదే. మరిన్ని భారీ డీల్స్‌ రానున్న క్వార్టర్లలో సాధించగలమని కంపెనీ ధీమాగా ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) విభాగం మళ్లీ పుంజుకుంటోంది. డిజిటల్‌ విభాగం మంచి జోరు సాధించింది. హెల్త్‌కేర్, లైఫ్‌–సైన్సెస్, పబ్లిక్‌ సర్వీసెస్‌  విభాగాలు మినహా ఇతర విభాగాల పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 9.6 శాతం నుంచి 11.5 శాతం రేంజ్‌లో ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. రెండేళ్లలో ఆదాయం 10 శాతం, షేర్‌ వారీ ఆర్జన(ఈపీఎస్‌) 9 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. ఇబిట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 19.7 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 శాతంగా ఉండొచ్చని భావిస్తున్నాం.  
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top