మళ్లీ 3000 పాయింట్లకు ఎస్‌అండ్‌పీ! | S&P 500 tops 3,000 | Sakshi
Sakshi News home page

మళ్లీ 3000 పాయింట్లకు ఎస్‌అండ్‌పీ!

May 27 2020 10:10 AM | Updated on May 27 2020 10:10 AM

S&P 500 tops 3,000 - Sakshi

యూఎస్‌ మార్కెట్లు మంగళవారం మంచి ర్యాలీ జరిపాయి. పలు షేర్లు అప్‌మూవ్‌ చూపడంతో ఎస్‌అండ్‌పీ 500 సూచీ మరలా 3000 పాయింట్లను దాటింది. కరోనావైరస్‌కు వాక్సిన్‌ దిశగా ముందడుగులు, యూఎస్‌ ఎకానమీలో వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడం.. సూచీలకు ఉత్సాహాన్నిచ్చాయి. దీంతో మార్చి5 తర్వాత తొలిసారి ఎస్‌అండ్‌పీ సూచీ కీలక 3000 పాయింట్ల పైకి చేరింది. అయితే చివరలో కాస్త లాభాలస్వీకరణ రావడంతో 2991 పాయింట్ల వద్ద క్లోజయింది. సూచీలోని 11 విభిన్న రంగాల సూచీలు పాజిటివ్‌గా ముగిశాయి. ఈ అప్‌మూవ్‌తో మార్చి కనిష్ఠాల నుంచి సూచీ దాదాపు 36 శాతం లాభపడినట్లయింది. ప్రస్తుతం ఫిబ్రవరి ఆల్‌టైమ్‌ హైకి కేవలం 13 శాతం దూరంలో ఉంది. ఇతర కీలక సూచీలు డౌజోన్స్‌, నాస్‌డాక్‌ సైతం లాభాల్లో ముగిశాయి. కరోనా వాక్సిన్‌ ట్రయిల్స్‌ చేస్తున్నట్లు ప్రకటించిన బయోకంపెనీ నోవావాక్స్‌ షేర్లు దాదాపు 15 శాతం దూసుకుపోయాయి. అయితే నిరుద్యోగిత పెరగడం, మాంద్య లక్షణాలు ముదరడంతో యూఎస్‌ ఎకానమీలో రికవరీ అనుకున్నంత వేగంగా ఉండకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement