ప్రపంచంలోనే అతి విధ్వంసకర ఫోన్‌ వచ్చేసింది | Sirin Finney Blockchain Smartphone With 6GB RAM Launched | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అతి విధ్వంసకర ఫోన్‌ వచ్చేసింది

May 12 2018 7:17 PM | Updated on May 12 2018 7:51 PM

Sirin Finney Blockchain Smartphone With 6GB RAM  Launched - Sakshi

సిరిన్‌ ఫిన్నే స్మార్ట్‌ఫోన్‌

సాక్షి, న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కు చెందిన సిరిన్ ల్యాబ్స్‌ విధ్వంసకర ఆవిషర్కరణకు తెర తీసింది.  ప్రపంచంలోనే తొలి బ్లాక్‌చైన్‌  టెక్నాలజీ ఫిన్నే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.  ప్రపంచంలోని అతి పెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్‌కాన్‌ అనుబంధంతో ఈ బ్లాక్‌చైన్‌ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందిస్తున్నట్టు గత నెలలోనే  ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా బిట్‌కాయిన్‌ లాంటి డిజిటల్‌ కరెన్సీ లావాదేవీలను అతి తక్కువ ఫీజుతో  చేసుకోవచ్చని వెల్లడించింది. దీని ధన సుమారు 67,300 రూపాయలుగా ఉండనుంది.  

సిరిన్‌ ఫిన్నే స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు
6.2 ఇంచెస్‌ డిస్‌ప్లే (18.9)
స్నాప్‌డ్రాగన్‌ 845ఎస్‌ఓసీ
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
6జీబీ ర్యామ్‌,  128జీబీ  స్టోరేజ్‌
12 ఎంపీ రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
3000ఎంఏహెచ్‌ బ్యాటరీ
బిట్‌కాయిన్‌ లాంటి క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు  ఈ  బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.  అంతేకాదు  ఈ ఫోన్‌లో కోల్ట్‌ స్టోరేజ్‌ క్రిప్టో వాలెట్‌ను కూడా పొందుపర్చింది. తద్వారా ఆటోమేటిగ్గా డిజిటల్స్‌  టోకెన్స్‌గా మన మనీని  కన్వర్ట్‌  చేసుకోవచ్చు. దీంతోపాటు డిజిటల్‌ అసెట్స్‌ను ఆఫ్‌లైన్‌లో  కూడా స్టోర్‌  చేసుకునే సౌలభ్యం కూడా ఉందని సిరిన్‌ తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement