breaking news
Sirin Labs
-
ప్రపంచంలోనే తొలి బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఫోన్
-
ప్రపంచంలోనే అతి విధ్వంసకర ఫోన్ వచ్చేసింది
సాక్షి, న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కు చెందిన సిరిన్ ల్యాబ్స్ విధ్వంసకర ఆవిషర్కరణకు తెర తీసింది. ప్రపంచంలోనే తొలి బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఫిన్నే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రపంచంలోని అతి పెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్‌కాన్ అనుబంధంతో ఈ బ్లాక్‌చైన్ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందిస్తున్నట్టు గత నెలలోనే ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా బిట్‌కాయిన్ లాంటి డిజిటల్ కరెన్సీ లావాదేవీలను అతి తక్కువ ఫీజుతో చేసుకోవచ్చని వెల్లడించింది. దీని ధన సుమారు 67,300 రూపాయలుగా ఉండనుంది. సిరిన్ ఫిన్నే స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 6.2 ఇంచెస్ డిస్ప్లే (18.9) స్నాప్‌డ్రాగన్ 845ఎస్ఓసీ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 12 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000ఎంఏహెచ్ బ్యాటరీ బిట్‌కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు ఈ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ ఫోన్లో కోల్ట్ స్టోరేజ్ క్రిప్టో వాలెట్‌ను కూడా పొందుపర్చింది. తద్వారా ఆటోమేటిగ్గా డిజిటల్స్ టోకెన్స్‌గా మన మనీని కన్వర్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు డిజిటల్ అసెట్స్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా స్టోర్ చేసుకునే సౌలభ్యం కూడా ఉందని సిరిన్ తెలిపింది. -
ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు రూ. 9 లక్షలు
లండన్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ను ఇజ్రాయెల్ స్టార్టప్ కంపెనీ సిరిన్ ల్యాబ్స్ మంగళవారం నాడు లండన్ మార్కెట్లో ఆవిష్కరించింది. సైనిక స్థాయి భద్రతా వ్యవస్థ కలిగిన ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ఖరీదు అక్షరాల 14వేల డాలర్లు (9.3 లక్షల రూపాయలు). రోల్స్ రాయిస్ స్మార్ట్‌ఫోన్‌గా అభివర్ణిస్తున్న ఈ ఫోన్‌కు ‘సోలారిన్’ అని పేరు పెట్టారు. మొబైల్ ఫోన్ ద్వారా విస్తృత వ్యాపార లావాదేవీలను నిర్వహించే అంతర్జాతీయ వ్యాపారవేత్తలను దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అత్యాధునిక క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్ కలిగిన దీనికి 23.8 మెగాపిక్సల్ రియర్ కెమేరా, 5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ఈడీ 2కే రెసల్యూషన్ తెర కలిగి ఉంది. సుపీరియర్ వైఫై కనెక్టివిటీ సౌకర్యం కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ వెనకాలున్న బటన్‌ను భౌతికంగా నొక్కడం ద్వారానే ఫోన్ యాక్టివేట్ అవుతుంది. ప్రపంచంలో ఇంతవరకు ఏ ఫోన్లో లేని ప్రైవసీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయని, ఈ విషయంలో ప్రముఖ కమ్యూనికేషన్ సెక్యూరిటీ సంస్థ ‘కూల్ స్పాన్’ సహకారం తీసుకున్నామని కంపెనీ వర్గాలు తెలిపాయి. సైబర్ దాడులు నిత్యకృత్యం అయిన నేటి పరిస్థితుల్లో ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఫోన్‌ను తయారు చేశామని కంపెనీ వర్గాలు తెలిపాయి. లండన్‌లోని మేఫేర్ భవనం షోరూమ్‌లో ఈ రోజు నుంచి ఈ ఖరీదైన ఫోన్ అమ్మకాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన ఫోన్ ‘వర్చూ టీఐ’ దాని ధర మార్కెట్లో 6,40,990 రూపాయలు. మొదట నోకియా కంపెనీతో కలసి బ్రాండ్ మేకర్ వర్చూ ఈ ఫోన్‌ను తీసుకరావాలనుకొంది. ఆ తర్వాత మార్కెట్ టర్మ్స్ కుదరక నోకియాతో విడిపోయి సొంతంగానే ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.